మహాశివరాత్రి సమీపిస్తోండడం వల్ల, ఎవరు ఎక్కడ ఉన్నా, అందరికీ ఆదియోగి అనుగ్రహం పొందే అవకాశం లభించాలని సద్గురు ఆశిస్తున్నారు. ఆదియోగి అనుగ్రహం పొందడానికి ఒక మార్గం, రుద్రాక్ష దీక్ష. మరింత ఎరుకతో జీవించడానికి, ఇంకా, వివిధ సాధనలు మరియు ప్రత్యేకంగా రూపొందించబడిన ఒక సాధన ద్వారా, అనుగ్రహం పొందడానికి, ఇది ఒక శక్తిమంతమైన మార్గం. మీ శరీరం, మనసు ఇంకా శక్తులు, శివుడి ఆనందభాష్పాల్లో పూర్తిగా తడిసి ముద్దైపోవడానికి, రుద్రాక్ష దీక్ష ఒక గొప్ప అవకాశం
మీరు https://mahashivarathri.org/te/rudraksha-diksha ద్వారా ఆన్లైన్లో రిజిస్టర్ అవ్వచ్చు.
మేము వాట్సాప్ ఇంకా మిస్డ్‌కాల్ అలర్ట్ ద్వారా రిజిస్ట్రేషన్‌ను ప్రారంభించే ప్రక్రియలో ఉన్నాము. మరిన్ని వివరాలు త్వరలో ఈ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. మీరు మీ స్నేహితులు, కుటుంబ సభ్యులను కూడా ఈ రుద్రాక్ష దీక్షలో భాగం చేయవచ్చు.
లేదు. రుద్రాక్ష దీక్ష ఉచితంగా అందిచబడుతుంది. మీ ఇంటికి కూడా ఉచితంగా డెలివరీ చేయబడుతుంది. ఆదియోగి కృపను మీరు అందుకునేందుకు సద్గురు అందించే సమర్పణ.
10లక్షలకు పైగా ప్రత్యేకంగా ప్రతిష్ఠింపబడిన రుద్రాక్షలు ఇంకా ఒక సాధకుడికి తన సాధనలో సహకరించే ఇతర వస్తువులతో కలుపుకుని అందరికీ ఉచితంగా పంపిణీ చేసేందుకు తయారుచేయబడుతున్నాయి.
మీకు విరాళం ఇచ్చే అవకాశం కూడా ఉన్నది, తద్వారా రుద్రాక్ష దీక్ష ద్వారా అందరికీ కనీసం ఒక్క చుక్క ఆధ్యాత్మికతను అందించడంలో మీరు సహాయపడగలరు.
రుద్రాక్ష దీక్షలో భాగంగా మీకు ఒకే రుద్రాక్ష అవసరమౌతుంది. కానీ, ఒక రిజిస్ట్రేషన్ కు, 2 రుద్రాక్షలు ఇవ్వబడతాయి. రెండో రుద్రాక్షను మీ కుటుంబ సభ్యుడికి లేదా స్నేహితుడికి ఇవచ్చు.
ఖచ్చితంగా సాధ్యమే. మీరు కోరుకున్నంత మందికి రుద్రాక్ష దీక్షను స్వీకరించే అవకాశాన్ని మీరు అందించవచ్చు. ఇంకా వారి జీవితంలో ‘ఒక చుక్క ఆధ్యాత్మికత’ను తీసుకురావచ్చు.
మీరు రుద్రక్ష సేవ కోసం రిజిస్టర్ చేసుకోవచ్చు. మీరు అందరికీ రుద్రాక్ష దీక్ష అందించే అవకాశం ఇది. దీని గురించి ఈ వెబ్సైట్లో వివరాలు త్వరలో అప్డేట్ చేయబడతాయి.
మీరు వాట్సాప్, ఫేస్బుక్ లేదా ట్విట్టర్ ఉపయోగించి రుద్రాక్ష దీక్ష వివరాలను మీ కుటుంబం మరియు స్నేహితులతో పంచుకోవచ్చు:
అవును. రుద్రాక్ష దీక్షను స్వీకరించే అవకాశాన్ని సద్గురు మొట్టమొదటిసారి అందిస్తున్నారు. ఇందులో రుద్రాక్షతో పాటు విభూతి, అభయ సూత్రం మరియు ఆదియోగి ఫోటోను కూడా పొందే అవకాశం ఉంటుంది.
లేదు. అంతర్జాతీయ డెలివరీలో సవాళ్ల కారణంగా రుద్రాక్ష దీక్ష ప్రస్తుతం భారతదేశంలో మాత్రమే అందుబాటులో ఉంది.
రుద్రాక్ష దీక్షను, మాహాశివరాత్రి రోజున, లక్షలాది భక్తులకు అందిస్తాము. అధిక మొత్తంలో ప్యాకేజీలు ఉండడం వల్ల, మీ ప్యాకేజీ పొందడానికి కొన్ని నెలలు పట్టొచ్చు.
ఇందుకు, మీ సహకారం కోరుతున్నాము. ప్యాకేజీలు, ఇండియా పోస్ట్ ద్వారా పంపబడతాయని గమనించండి.
అవును. డెలివరీకి పంపిన తర్వాత మీకు SMS వస్తుంది. ఆ తరువాత, మీరు మీ రుద్రాక్ష దీక్ష ప్యాకేజీని ఇక్కడ ట్రాక్ చేయవచ్చు. <link>
భారతదేశంలో ఉంటున్న వారు, రుద్రాక్ష దీక్ష ప్యాకేజ్ రిజిస్ట్రేషన్ లేదా డెలివరీకి సంబంధించిన సమస్యల విషయంలో మమ్మల్ని rudraksh.diksha@ishafoundation.org వద్ద సంప్రదించవచ్చు.
విరాళానికి సంబంధించిన ప్రశ్నల కోసం, మీరు Rudrakshdiksha.payment@ishafoundation.org కు వ్రాయవచ్చు.
డెలివరీ చేయడానికి ముందు అన్ని సమర్పణలు పూర్తిగా తనిఖీ చేయబడతాయి. అయితే, రవాణా సమయంలో సరిగా వ్యవహరించకపోవడం వల్ల రుద్రాక్ష పూస ఏమైనా దెబ్బతిన్నట్లయితే, దయచేసి దాన్ని ఉపయోగించవద్దు. దయచేసి మమ్మల్ని సంప్రదించండి.
మీ రుద్రాక్ష దీక్ష ప్యాకేజీ దెబ్బతిన్నట్లయితే, దయచేసి మమ్మల్ని సంప్రదించండి. మేము మీకు సహకరిస్తాము. ఏవైనా కారణాల వల్ల మీరు వాటిని తిరిగి ఇచ్చేయాలని లేదా ఉపయోగించకూడదని అనుకుంటే, దయచేసి దాన్ని మాకు తిరిగి పంపండి.
భారతదేశంలో ఉన్నవారు రుద్రాక్ష దీక్ష ప్యాకేజీ రిజిస్ట్రేషన్ లేదా డెలివరీకి సంబంధించిన సమస్యల విషయమై మమ్మల్ని rudraksh.diksha@ishafoundation.org ద్వారా సంప్రదించవచ్చు.
అవును, అలా చేయవచ్చు. మీరు దీన్ని ఇతర రుద్రాక్షలతో పాటు ధరించవచ్చు.
గత సంవత్సరాల్లో అందించిన రుద్రాక్షలు, కొంతకాలం పాటు ఆదియోగిని మెడలో అలంకరించాబడ్డాయి.
రుద్రాక్ష దీక్షలో భాగంగా పంపబడుతున్న రుద్రాక్షలను మహాశివరాత్రి నాడు సద్గురు ప్రత్యేకంగా ప్రతిష్ఠించబోతున్నారు.
రుద్రాక్ష దీక్షకు రిజిస్టర్ అవ్వమని మీరు మీ కుటుంబం మరియు స్నేహితులకు చెప్పవచ్చు. మీరు ఎక్కువ మందికి రుద్రాక్ష దీక్షను అందిస్తామని ప్రతిజ్ఞ చేయవచ్చు. మీరు శివాంగలా మారిపోవచ్చు, లేదా నిధుల సమీకరణ చేయడం (ఫండ్ రైజింగ్ చేయడం) చేయవచ్చు, ఇంకా రుద్రాక్ష దీక్షను 108, 1,008 లేదా 10,008 మందికి విరాళంగా ఇస్తామని ప్రతిజ్ఞ చేయవచ్చు. మరిన్ని వివరాల కోసం, దయచేసి ఇక్కడ క్లిక్ చేయండి.
డెలివరీలు ఎక్కువగా ఉండడం వల్ల, మిమ్మల్ని కాస్త ఓపికతో ఉండమని కోరుతున్నాము. అలాగే, మీ కంసైన్మెంట్ ను ట్రాక్ చేస్తూ ఉండండి. ఈ ప్యాకేజీలను, పోస్టల్ శాఖ వారు వ్యవహరిస్తున్నారు. వారు వీటిని బ్యాచ్‌ల ప్రకారం డెలివరీ చేస్తున్నారు.
రుద్రాక్ష ఒక చెట్టు యొక్క ఎండిన విత్తనాలు, వీటిని వృక్షశాస్త్రపరంగా ఎలియోకార్పస్ గనిట్రస్ అని పిలుస్తారు, ఇవి ఎక్కువగా ఆగ్నేయాసియాలోని కొన్ని నిర్దిష్టమైన ప్రదేశాలలో పెరుగుతాయి, ప్రధానంగా భారత ఉపఖండంలోని ఎగువ హిమాలయ పర్వత శ్రేణిలో పెరుగుతాయి. రుద్రాక్ష అనే పదానికి "శివుని కన్నీటి బిందువులు" అని అర్థం.
శారీరక మరియు మానసిక సమతుల్యతను కాపాడుకోవడంలో రుద్రాక్ష చాలా సహకరిస్తుంది. రుద్రాక్ష రక్తపోటును తగ్గించడానికి, నరాలను శాంతపరచడానికి ఇంకా చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అంతర్-దృష్టి పెంపొందించడం, ధ్యానంలో ఉపకరించడం, కాంతి వలయాన్ని శుద్ధిచేయడం ఇంకా ప్రతికూల శక్తుల నుండి సంరక్షించడం మొదలైనవి రుద్రాక్షకు ఆపాదించబడిన కొన్ని సూక్ష్మ ప్రయోజనాలు.
వయస్సు, లింగం, శారీరక స్థితి, సంస్కృతి, జాతి, భౌగోళిక లేదా మతపరమైన నేపథ్యంతో సంబంధం లేకుండా ఎవరైనా జీవితంలో ఏ దశలోనైనా మేము అందించే రుద్రాక్షను ధరించవచ్చు. ప్రత్యేకించి పిల్లలు, విద్యార్థులు ఇంకా వృద్ధులు ధరించడం వల్ల ఇది చాలా ప్రయోజనాన్ని చేకూరుస్తుంది.
రుద్రాక్ష ఎల్లప్పుడూ మీ మెడ భాగంలో ధరించాలి.
మీరు చన్నీటి స్నానాలు చేసి, రసాయనాలతో కూడిన సబ్బును ఉపయోగించకపోతే, రుద్రాక్షపై ఇంకా మీ శరీరంపై నీరు ప్రవహించడం మంచిది. కానీ మీరు రసాయనాలతో కూడిన సబ్బులు ఇంకా వెచ్చని నీటిని ఉపయోగిస్తుంటే, అది పెళుసుగా మారుతుంది ఇంకా కొంతకాలం తర్వాత పగుళ్లు ఏర్పడతాయి, కాబట్టి అలాంటి సమయాల్లో ధరించకుండా ఉండటం మంచిది. దయచేసి స్నానం చేసేటప్పుడు రుద్రాక్షను ఒక గుడ్డ మీద ఉంచండి.
అవును. రుద్రాక్షను ఎవ్వరైనా, ఏ సమయంలోనైనా ధరించవచ్చు.
ఏదైనా కారణం వల్ల, మీరు రుద్రాక్ష ధరించలేకపోతే, దానిని సురక్షితంగా ఉంచాలి, కాటన్ లేదా పట్టు వంటి ప్రకృతి సిద్ధమైన వస్త్రంతో చుట్టాలి. దయచేసి దానిని లోహపు కంటైనర్‌లో ఉంచవద్దు.
మొదట వాటిని ధరించే ముందు రుద్రాక్షను కండీషన్ చేయడం ముఖ్యం. కొత్త రుద్రాక్ష పూసలను కండీషన్ చేయడానికి, వాటిని నెయ్యి (స్పష్టీకరించిన వెన్న) లో 24 గంటలు ముంచి, ఆపై వాటిని కొవ్వుతీయని పాలలో 24 గంటలు నానబెట్టండి. తరువాత నీటితో శుభ్రం చేసి, పూసలను శుభ్రమైన గుడ్డతో తుడవండి. సబ్బు లేదా ఇతర రసాయనలతో చేసిన శుద్ధి కారకాలతో వాటిని కడగకండి. వాటిని ప్రతి ఆరునెలలకు ఒకసారి కండీషనింగ్ చేయాలి.
రాగి ఒక నిర్దిష్ట శక్తిని సృష్టించగలిగే ఒక లోహం. ఇంకా ధ్యానంలో ఉపకరిస్తుంది. దానిని శరీరంతో తాకి ఉంచడం వల్ల, మన శక్తి వ్యవస్థను బలోపేతం చేయడానికి ఇంకా సమతులయంలోకి తీసుకురావడానికి సహాయపడుతుంది.
మీరు రుద్రాక్షకు ఇరువైపులా ముడి వేస్తుంటే, రుద్రాక్ష లోపలి భాగంలో పగుళ్లు ఏర్పడగలవు కాబట్టి దానిని చాలా గట్టిగా కట్టకుండా జాగ్రత్త తీసుకోవాలి. లోపలి భాగం ఒత్తిడితో కూలిపోతే, రుద్రాక్ష ధరించకూడదు. అలాగే, రుద్రాక్షకు కోతలు పడకుండా చూసుకోండి.
https://isha.sadhguru.org/in/en/wisdom/article/the-significance-of-rudraksha
విభూతి, లేదా పవిత్రమైన బూడిద, శివుడితో దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది. తల నుండి పాదాల వరకూ బూడిద రాసుకున్న వాడిలా శివుడిని చిత్రీకరిస్తారు. ఇది జీవితం యొక్క అశాశ్వత స్వభావాన్ని సూచిస్తుంది. ఆధ్యాత్మిక ప్రక్రియ మూలం, అశాశ్వత స్వభావాన్ని(చనిపోతామనే విషయాన్ని) గ్రహించడం; విభూతి దీనిని నిరంతరం గుర్తు చేస్తూ ఉంటుంది. భారతీయ సంస్కృతిలో, ఇది సాధకుడికి ఒక శక్తివంతమైన సాధనంగా కూడా ఉపయోగించబడుతుంది, ఎందుకంటే దీనిని సరైన విధంగా తయారుచేసి, శరీరంపై ధరించినప్పుడు, అది సాధకుని గ్రహణశక్తిని పెంచుతుంది, అలాగే శక్తిని ప్రసారం చేయడానికి గొప్ప మాధ్యమంగా ఉపయోగపడుతుంది.
సాంప్రదాయకంగా, యోగులు దహన వాటికల నుండి బూడిదను ఉపయోగించేవారు, కాని విభూతిని ఆవు పేడ లేదా బియ్యం పొట్టు నుండి కూడా తయారు చేయవచ్చు.
ఈశా విభూతిని శక్తీకరించడం కోసం కొంత కాలం పాటు ధ్యానలింగంలో ఉంచబడింది. తద్వారా అది ధ్యానలింగ శక్తిని తనలోకి గ్రహిస్తుంది.
సాంప్రదాయకంగా, విభూతిని ఉంగరపు వేలు మరియు బొటనవేలు మధ్య తీసుకొని, శరీరంపై వివిధ స్థానాలలో పెట్టుకుంటారు: కనుబొమ్మల మధ్య ఉండే దానిని, ఆజ్ఞ చక్రం అని పిలుస్తారు; గొంతు భాగంలో కుతిక వద్ద ఉండే దానిని, విశుద్ధి చక్రం అని పిలుస్తారు; ఇంకా పక్కటెముకలు కలుసుకునే ఛాతీ మధ్యభాగంలో ఉండే దానిని అనాహత చక్రం అని పిలుస్తారు.
మీలో మెరుగైన స్పష్టత కలిగేందుకు విభూతిని ఆజ్ఞ వద్ద ధరించాలి; మీ మార్గంలో ఒక నిర్దిష్ట శక్తిని స్థాపించడానికి విశుద్ధి వద్ద, ఇంకా మీ జీవితంలో ప్రేమ ఇంకా భక్తి పార్శ్వాన్ని తీసుకురావడానికి అనాహత వద్ద విభూతిని పెట్టుకోవాలి.
అభయ సూత్రం అనేది ప్రత్యేకంగా ప్రతిష్ఠింపబడిన ఒక సూత్రం. దీనిని చేతి మణికట్టు చుట్టూ కట్టుకుంటారు. “అభయ” అంటే “భయం లేకపోవడం” అని అర్ధం ఇంకా మన భయాలను అధిగమించడంలో అలాగే మన ఆశయాలను నెరవేర్చడంలో ఈ సూత్రం సహాయపడుతుంది.
అభయ సూత్రం అనేది కాటన్ దారంతో చేయబడింది.
మహిళలు తమ ఎడమ మణికట్టుకి, పురుషులు వారి కుడి మణికట్టుకి ధరించాలి. ఇది కనీసం 40 రోజులు ధరించాలి. దానిని విప్పడం లేదా కాల్చడం ద్వారా (దయచేసి దానిని కత్తిరించవద్దు) తీయవచ్చు, అదే విధంగా తడి మట్టిలో పాతిపెట్టడం ద్వారా లేదా దానిని కాల్చడం ద్వారా తొలగించవచ్చు. కాల్చగా వచ్చిన బూడిదను మీ విశుద్ధి (గొంతు యొక్క బొంది)వద్ద ఇంకా దిగువన అనాహత వద్ద పెట్టుకోవచ్చు.
https://isha.sadhguru.org/in/en/wisdom/article/sutra-more-than-a-thread
“ఆదియోగి విశిష్టత ఏమిటంటే, మానవ చైతన్యాన్ని జాగృతం చేసేందుకు, ఆయన సర్వ కాలాలకూ ఉపయోగపడే పద్ధతులను అందించాడు.” -సద్గురు
15000 సంవత్సరాల క్రితం, అన్ని మతాలకంటే ముందు, ఆదియోగి (మొదటి యోగి), యోగ శాస్త్రాన్ని, సప్త ఋషులు అయిన తన ఏడుగురు శిష్యులకు అందించాడు. మానవులు తమ పరిమితుల్ని అధిగమించి, పరమోత్తమ సంభావ్యతను చేరేందుకు 112 పద్ధతులను వివరించాడు. ఆదియోగి అందించిన పద్ధతులు, వ్యక్తి పరివర్తనకు సాధనాలు. ప్రపంచాన్ని పరివర్తన చేయాలంటే దానికి వ్యక్తిగత పరివర్తన ఒక్కటే మార్గం. మానవ శ్రేయస్సు ఇంకా విముక్తి కోసం “బయటపడేందుకు గల ఏకైక మార్గం అంతర్ముఖమే” అనేది ఆయన ప్రధాన సందేశం.
వేల ఏళ్ల క్రితం, మానవాళికి ఆదియోగి అందించిన ఉన్నతికి ఉపకరణాలు, కేవలం అన్యయింపబడడమే కాదు, అవి ఈరోజు చాలా ముఖ్యమైనవి. ఈశా యోగా కేంద్రంలోని 112 అడుగుల ఆదియోగి ముఖారవిందం, అందరికీ ఒక శక్తివంతమైన మేల్కొలుపు ఇంకా స్ఫూర్తి.